భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు..
- April 04, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశంలో గతంలో కన్నా తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు…ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి.మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. తాజాగా.. 24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నట్లు, దేశంలో 0.03 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 4,30,29,044 కేసులు నమోదయ్యాయని, 5,21,358 మరణాలు సంభవించాయని తెలిపింది. దేశంలో 98.76 శాతంగా కరోనా రికవరీ రేటుగా ఉందని, కరోనా నుంచి 24 గంటల్లో 1316 కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,95,089 చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







