ఏప్రిల్ 6న ఇండియన్ ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 04, 2022
కువైట్: తదుపరి వీక్లీ ఓపెన్ హౌస్, ఏప్రిల్ 6న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్ అబ్బాసియాలో భారత రాయబారి సమక్షంలో జరగనుంది.రాయబారి విబి జార్జి ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశమవుతారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్, ఎం ఫ్లోర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన భారతీయులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాస్‌పోర్టులో వున్న పూర్తి పేరు, పాస్‌పోర్టు నంబర్, సివిల్ ఐడీ నెంబర్ మరియు కాంటాక్ట్ నెంబర్, కువైట్‌లో చిరునామా తదితర వివరాల్ని [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







