భార్యను చంపి, కూతురిపై యాసిడ్‌తో దాడి
- April 04, 2022
జెడ్డా: జెడ్డాలో అల్ సమిర్ పోలీస్, ఓ వ్యక్తిని హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు తన భార్యను హత్య చేసి, ఆమె కుమార్తెపై యాసిడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.యాసిడ్ దాడిపై 911 నెంబర్‌కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పోలీసులకు తీవ్ర గాయాలతో పడి వున్న బాధితులు కనిపించారు.వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది.నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.అతని కోసం వేట కొనసాగించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.కుటుంబ తగాదాల వల్లనే ఈ హత్య జరిగింది.10 నెలల క్రితమే వివాహం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ కుమార్తె, మృతురాలి మొదటి భర్త ద్వారా జన్మించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







