హైదరాబాద్ డ్రగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
- April 05, 2022
హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా అతని కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు..ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా మకాం మూరుస్తూ పోలీసులను ఏమారుస్తున్న లక్ష్మీపతి పోలీసులకు దొరికిపోయాడు. నల్లకుంట కేసులో పరారీలో ఉన్న లక్ష్మీపతిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో తొలి డ్రగ్ మరణం వెనుక లక్ష్మీపతి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. నగరంలో స్ట్రాంగ్ డ్రడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక ఫార్మూలాతో డ్రగ్స్ తయారు చేసి అమ్మేవాడు. నగరంలో ఉన్న పలువురికి లక్ష్మిపతి హాష్ ఆయిల్ సప్లై చేశాడు. బీటెక్ విద్యార్థి డ్రగ్స్ తీసుకుని చనిపోయిన కేసులో లక్ష్మీపతి కీలక సూత్రధారిగా ఉన్నాడు.
లక్ష్మీపతి ఏడేళ్లుగా గంజాయికి బానిసయ్యాడు. బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే లక్ష్మీపతి గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడు. లక్ష్మీపతి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ కొని హైదరాబాద్ లో అమ్మేవాడు. లక్ష రూపాయలకు లీటర్ ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేశాడు.
హైదరాబాద్‌లో లీటర్ ఆశిష్ ఆయిల్‌ని రూ.8లక్షలకు అమ్మారు. ప్రేమ్‌కుమార్, లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేవారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు లక్ష్మీపతి అమ్మేవాడు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







