ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం.ఇప్పుడు రాకపోతె ఇంకెప్పుడు?
- April 06, 2022
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 50 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.అందులో బాగంగా యు.యెస్.ఏ నుంచి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాత గా 3 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల (zoom) కార్యక్రమములో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర మరియు ఘంటసాల కుమార్తె శ్యామల ఘంటసాల ముఖ్యఅతిధులుగా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం మరియు దేశభక్తిని కొనియాడారు. శ్యామల ఘంటసాల మాట్లాడుతూ వారి నాన్నతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తు ఎంతో భావోగ్వేదానికి లోనయారు, అలాగే ఘంటసాల పేరును భారత ప్రభుత్వము ప్రచురించిన 'సన్సు అఫ్ సాయిల్' పుస్తకంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అని పేర్కొందని తన వదిన కృష్ణకుమారి ఘంటసాల గారు చెప్పారని, ఆ విషయం చాలామందికి తెలియదని వివరించారు. ఘంటసాల దేశభక్తి, పెద్దలయందు గౌరవభావం, సేవాతత్పరత మొదలగు విషయాలు పంచుకున్నప్పుడు ప్రేక్షకుల హృదయాలు ఒక్కసారిగా ద్రవించాయి. ఈ సందర్భంగా ఘంటసాల కి భారతరత్న కోసం మీరందరు చేస్తున్న కృషిని అభినందించి మీ అందరి కృషి ఫలించాలని అభిలాషించారు, ఘంటసాల కుటుంభం తరుపున నిర్వాహుకుల అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డు కి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం అని అన్నారు. శ్యామల ఘంటసాల వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం నిర్వాహుకులందరికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని తెలిపారు.
యు.యెస్.ఏ నుండి న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్, రవి పోనంగి, న్యూజిలాండ్ నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు మరియు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు రుద్ర కొట్టు, ఇండోనేషియా నుండి ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామ కృష్ణ బండారు తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులుతో పాటు, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 53 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని,ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రామనికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి గారు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.

తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







