అగ్నికి ఆహుతైన ఒమన్ ఎన్నారై వ్యక్తి భార్యాబిడ్డలు..!
- April 06, 2022
కేరళ: ఒమన్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్యాబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.పూర్తిగా కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. కేరళలోని పథనంతిట్ట నగరంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది.మృతులను రిన్సా(21), ఎల్హానా(3)గా పోలీసులు గుర్తించారు. రిన్సా భర్త సాజూ మస్కట్‌లో ఉన్నారు.ఆయన భార్యాబిడ్డలు ఒంటరిగానే ఆ ఇంట్లో నివసించేవారు.వాళ్లిద్దరిని చివరిసారిగా సోమవారం ఉదయం చూసామని ఇరుగుపొరుగు తెలిపారు.
సోమవారం సాయంత్రం సాజూ సోదరుడి కుమార్తె.. రిన్సా ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.దీంతో.. అనుమానం వచ్చిన ఆమె తన తండ్రికి సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించగా.. మంటల్లో కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు కనిపించాయి.కాగా.. ఇంట్లో కిరోసిన్ వాసన కూడా వచ్చినట్టు పోలీసులు తెలిపారు.అయితే.. ఎటువంటి సూసైడ్ నోట్ వారికి లభించలేదు.అనంతరం మృతదేహాలను రాణిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







