3 నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన 27,200 మంది కార్మికులు

- April 07, 2022 , by Maagulf
3 నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన 27,200 మంది కార్మికులు

కువైట్: సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత మూడు నెలల్లో 27,200 మంది ప్రవాస కార్మికులు స్థానిక లేబర్ మార్కెట్‌ను విడిచిపెట్టారు. మార్కెట్‌లో విదేశీ కార్మికుల సంఖ్య గత డిసెంబర్‌లో 1,479,545గా ఉండగా.. అది తాజాగా 1,452,344కి తగ్గింది. డిసెంబరు 2021లో డేటా ప్రకారం.. జాతీయత స్థానిక లేబర్ మార్కెట్‌లో (కుటుంబ రంగాన్ని మినహాయించి) మొత్తం 451,000 మందితో ఈజిప్టు అగ్రస్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన కార్మికులు మొత్తం 437,000 మందితో రెండో స్థానంలో ఉంది. 158,700 మందితో బంగ్లాదేశ్ కార్మికులు మూడవ స్థానంలో ఉన్నారు. 69,500 మందితో పాకిస్థాన్, 64,300 మందితో ఫిలిప్పీన్స్, 63,300 మందితో సిరియా, 38,000 మందితో నేపాల్, 25,500 మందితో జోర్డాన్, 20,000 మందితో ఇరాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com