ఊటీలో ‘ది ఘోస్ట్’ తాజా షెడ్యూల్ ప్రారంభం..
- April 08, 2022
ఊటీ: టాలీవుడ్ కింగ్ నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది.ఇందులో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా,ఆయన సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను,యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. ఇదే క్రమంలో తాజా షెడ్యూల్‌ను మేకర్స్ ఊటీలో ప్రారంభించారు. విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ది ఘోస్ట్’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. ఏషియన్ సునీల్, నారణ దాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Mornings in Ooty are always magical 😍#TheGhost @iamnagarjuna @sonalchauhan7 @AsianSuniel #NarayanDasNarang #RamMohanRao @sharrath_marar @SVCLLP @nseplofficial #TheGhostDiaries pic.twitter.com/ubTlyD3HjM
— Praveen Sattaru (@PraveenSattaru) April 8, 2022
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







