అబుధాబి-జైపూర్ ఎయిర్ అరేబియా విమాన సర్వీస్
- April 08, 2022
అబుధాబి: యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్‌కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్‌కు ఈ కొత్త సర్వీస్‌ను నడపనుంది.ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా ప్రకటించింది.ఈ మేరకు గురువారం విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది.భారత్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైనా, ఎన్నో అద్భుత కట్టడాలతో వారసత్వ సంపదకు నెలవుగా ఉన్న పింక్ సిటీ జైపూర్‌కు కొత్త సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, జూలై 2020లో అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యారియర్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుండి ఇది ఎయిర్ అరేబియాకు 18వ రూట్‌గా తెలిపింది. కస్టమర్లు ఈ సర్వీసుకు సంబంధించిన విమాన టికెట్ల కోసం ఎయిర్ అరేబియా అధికారి వెబ్సైట్ https://www.airarabia.com/ లేదా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
--సుమన్ కోలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







