శ్రీ తోట తరణి గారికి హార్ధిక స్వాగతం !
- April 08, 2022
హైదరాబాద్: అగ్రశ్రేణి కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ శ్రీ తోట తరణి గారు కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం శ్రీ తోట తరణి గారు హరిహర వీరమల్లు షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న శ్రీ తరణి గారు నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి... అధ్యయన అభిలాషకు అద్దంపడతాయన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి శ్రీ తరణి గారితో పరిచయం ఉందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







