రహదారి భద్రతపై వీడియో షేర్ చేసిన అబుదాబి పోలీసులు

- April 09, 2022 , by Maagulf
రహదారి భద్రతపై వీడియో షేర్ చేసిన అబుదాబి పోలీసులు

అబుదాబి: రోడ్డుపై ప్రయాణించే క్రమంలో వాహనాలు ఆకస్మికంగా లేన్ మారడం వల్ల కలిగే ప్రమాదాలను తెలిపేందుకు అబుదాబి పోలీసులు ఓ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో రహదారి భద్రతపై జాగ్రత్తలను మరోసారి గుర్తు చేశారు. వాహనదారులు తమ వాహనాలను తిప్పడం లేదా అకస్మాత్తుగా దారులు మార్చడం వల్ల కలిగే ప్రమాదాలను పోలీసులు ఈ వీడియోలో చూపించారు. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. వాహనదారులు నిర్దేశించిన లేన్‌ లోనే వెళ్లాలని, నిర్దేశించిన వేగంలోనే వాహనాన్ని నడపాలని అబుదాబి పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com