127వ రోజుకు చేరుకున్న 'ఘంటసాల స్వర రాగ మహాయాగం'
- April 09, 2022
            "ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్" "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" "వంశీ ఇంటర్నేషనల్" మరియు "శుభోదయం గ్రూప్స్" సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించబడుతున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం"లో 127వ రోజు కార్యక్రమంలో శనివారం ప్రముఖ జానపద గాయనీమణి, సంగీత దర్శకురాలు, గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనుమరాలు స్నేహలత మురళి పాల్గొని ఘంటసాల వారి పాటలు అద్భుతంగా ఆలపించి, వారి అనుభవాలను పంచుకుంటున్న ఘంటసాల గారికి నివాళులు అర్పించారు.
వంశీ అధ్యక్షులు డా.వంశీ రామరాజు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ గౌరవ అతిథులుగా పాల్గొనగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు.శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







