127వ రోజుకు చేరుకున్న 'ఘంటసాల స్వర రాగ మహాయాగం'

- April 09, 2022 , by Maagulf
127వ రోజుకు చేరుకున్న \'ఘంటసాల స్వర రాగ మహాయాగం\'

"ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్" "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" "వంశీ ఇంటర్నేషనల్" మరియు "శుభోదయం గ్రూప్స్" సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించబడుతున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం"లో 127వ రోజు  కార్యక్రమంలో శనివారం ప్రముఖ జానపద గాయనీమణి, సంగీత దర్శకురాలు, గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనుమరాలు స్నేహలత మురళి పాల్గొని ఘంటసాల వారి పాటలు అద్భుతంగా ఆలపించి, వారి అనుభవాలను పంచుకుంటున్న ఘంటసాల గారికి నివాళులు అర్పించారు. 

వంశీ అధ్యక్షులు డా.వంశీ రామరాజు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ గౌరవ అతిథులుగా పాల్గొనగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు.శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com