ప్రైవేట్ రంగాలు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

- April 10, 2022 , by Maagulf
ప్రైవేట్ రంగాలు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఒమన్: ప్రవాస శ్రామిక శక్తికి సంబంధించి, వారికి మంజూరు చేయబడే వివిధ మినహాయింపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార యజమానులను ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) కోరింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) గత వారం రెసిడెంట్ కార్డ్ ల ఆలస్య పునరుద్ధరణకు సంబంధించి సంస్థలు, వ్యక్తులకు జరిమానాలు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చారని OCCI  ఛైర్మన్ ఎంగ్ రెధా బిన్ జుమా అల్ సలేహ్ తెలిపారు. ఈ మినహాయింపు లేబర్ మార్కెట్ పై అనుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడే విధంగా వ్యాపారాన్ని సులభతరం చేసే ప్రవాస శ్రామికశక్తి రిక్రూట్‌మెంట్ కోసం లైసెన్సుల జారీ, పునరుద్ధరణకు రుసుమును తగ్గించాలని హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ నుండి రాయల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ సలేహ్ చెప్పారు. కరోనా కాలంలో దెబ్బతిన్న అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తమ సంస్థలను పునర్నిర్మించడానికి ఈ మినహాయింపులు దోహదం చేస్తుందన్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ పునరుద్ధరణ జరిమానాల నుండి కంపెనీలు, వ్యక్తులను మినహాయించిందని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 1, 2022లోపు పునరుద్ధరణ పూర్తయితే, వర్క్ పర్మిట్‌ల కోసం కొత్త తగ్గింపు ఫీజులు జూన్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి. వర్క్ పర్మిట్ రాయితీ ఫీజుల కోసం రాయల్ ఆదేశాలకు అనుగుణంగా, కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవాసులకు వృత్తి రకాన్ని బట్టి కొత్త ఫీజులను ప్రకటించింది. ఒమనిసేషన్ శాతాన్ని అనుసరించే కంపెనీలకు 30 శాతం తగ్గింపు మంజూరు చేయబడుతుందని అల్ సలేహ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com