దుబాయ్‌లో న్యూ పార్కింగ్ జోన్స్
- April 03, 2016
దుబాయ్‌లో కొత్తగా ఇంకొన్ని పార్కింగ్ జోన్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఎ, బి, ఇ మరియు ఎఫ్కి అదనంగా సి, డి జోన్స్ కొత్తగా ఏర్పాటవుతున్నాయి. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రస్తుతం ఉన్న ఎ, బి సీజనల్ కార్డ్స్ కొత్త జోన్లలో కూడా వర్తిస్తాయి. బి కేటగిరీ సీజనల్ కార్డ్స్ బి మరియు డి జోన్లలో ఉపయోగించుకోవచ్చు. ఎ సీజనల్ కార్డ్స్ ఎ, బి, సి, డి జోన్లలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త జోన్ల పార్కింగ్ పీజుపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయమూ జరిగినట్లు సమాచారం లేదు. సీజనల్ కార్డుల్లోనూ కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చు. జోన్ ఎ, జోన్ బి కోసం 3 నెలల సీజనల్ కార్డుల్ని ప్రస్తుతం ఆర్టిఏ అందుబాటులో ఉంచింది. మే 28 నుంచి 6 నెలలు, 12 నెలల వ్యవధితో కూడిన కార్డులు అందుబాటులో ఉంటాయి. జోన్ ఎ- స్ట్రీట్ పార్కింగ్, బి - ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ ఉండగా, ఇ- ఫిష్ మార్కెట్, ఎఫ్- టెకామ్ ఏరియా ఇన్ అల్ సుఫోహ్ 2గా ఇప్పటిదాకా ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







