పుతిన్ కీలక నిర్ణయం...
- April 10, 2022
రష్యా: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి ఇప్పటికే 45 రోజులు గడిచాయి. అయినా… రష్యా తగ్గడం లేదు. వరసగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇన్ని రోజులుగా ప్రయత్నించినా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను మాత్రం రష్యా స్వాధీనం చేసుకోలేకపోయింది. కీవ్ ను స్వాధీనం చేసుకోలేక రష్యన్ బలగాలు వెనుదిరిగాయి.ఉక్రెయిన్ దళాలు ఎదురొడ్డి నిలుస్తుండటంతో రష్యన్ దళాలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా రష్యా 9 మంది కీలక కమాండర్లను కోల్పోయింది. 19,000మంది రష్యన్ సైనికులు యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్ ఆపరేషన్ కు చీఫ్ గా కొత్త వ్యక్తిని నియమించారు. సిరియాలో రష్యన్ ఆపరేషన్లకు సారథ్యం వహించిన అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ ను ఉక్రెయిన్ ఆపరేషన్ కు చీఫ్ గా నియమించారు పుతిన్. అయితే ఈ నియామకం తర్వాత ఉక్రెయిన్- రష్యా యుద్ధం మరింతగా తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు సమాయత్తం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







