రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ సాంగ్ 'బుల్ బుల్ తరంగ్' విడుదల
- April 10, 2022
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' మ్యూజికల్ జర్నీ మొదలైయింది. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట 'బుల్ బుల్ తరంగ్' పాట విడుదలైయింది.
'రామారావు ఆన్ డ్యూటీ' ఫుల్ లెంత్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిచింది. తాజాగా విడుదలైన 'బుల్ బుల్ తరంగ్' పాట రవితేజ పాత్రలోని రొమాంటిక్ యాంగిల్ ని ఆవిష్కరించింది. రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది.
ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించడం అభిమానులని అలరిస్తుంది. ఈ పాటలో రవితేజ వేసిన డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ కూల్ అండ్ క్లాస్ గా వున్నాయి.
సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ పాటకు సామ్ సిఎస్ స్వర పరిచిన ట్యూన్ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. ఈ పాటకు రాకేందు మౌళి చక్కని సాహిత్యన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సూపర్ హిట్ పాటతో 'రామారావు ఆన్ డ్యూటీ' మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







