ఢిల్లీలో ప్రారంభమైన సీఎం కెసిఆర్ దీక్ష
- April 11, 2022
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. దీక్షకు సీఎం కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ నివాళులర్పించారు.తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు.
కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేపట్టింది. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్‌తో ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వనుంది. దీక్ష వేదికగా టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







