జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్
- April 11, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం ఓ కీలక ప్రకటన చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి తనతో పాటు తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులంతా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వరలో జరగనున్న నూతన ప్రధాని ఎన్నికను బహిష్కరించనున్నట్లు పీటీఐ ఎంపీలు కాసేపటి క్రితం ప్రకటించారు.ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంతో ఏ సభలో అయితే తాను ప్రధాని పదవిని కోల్పోయారో..అదే సభకు ఇమ్రాన్ రాజీనామాను ప్రకటిస్తున్నట్టైంది.
కాగా, ఇవాళ జరిగిన పీటీఐ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీలో కూర్చోవద్దు అని నిర్ణయించామని, దేశాన్ని దోచుకున్నవారితో కలిసి పనిచేయలేమని ఇమ్రాన్ అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







