వెండితెరపై మరో మరో రెండు సంచలనమైన నిజాయితీ కథలు
- April 11, 2022
ముంబై: 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో తో పాన్ వరల్డ్ విజయాన్ని అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్ మానవ చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప నిజాయితీ కథలను వెండితెరపై చూపించబోతున్నారు.
వీరి కాంబినేషన్‌లో విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సినిమాని ఆకర్షించింది. 1990లో కాశ్మీరీ పండిట్‌లు ఎదురుకున్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. నిజాయితీ చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది. ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు నిజాయితీ గల కథలు వెండితెరపై చూపించాలని సంకల్పించారు.
250 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది.
ఈ చిత్రాలకు సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







