వైద్య సేవల ప్రైవేటీకరణ: ఖండించిన బహ్రెయిన్ వైద్య శాఖ

- April 11, 2022 , by Maagulf
వైద్య సేవల ప్రైవేటీకరణ: ఖండించిన బహ్రెయిన్ వైద్య శాఖ

బహ్రెయిన్: వైద్య సేవల్ని ప్రైవేటీకరించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆన్‌లైన్ పుకార్లపై బహ్రెయిన్ వైద్య శాఖ  స్పందించింది. ఆ పుకార్లలో వాస్తవం లేదని పేర్కొంది. ప్రస్తుత వైద్య విధానంలో మార్పులు చేయడం ద్వారా మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. కేవలం సౌకర్యాలను, సేవలను పెంచే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప, పూర్తిగా ప్రైవేటీకరణ అన్న ఆలోచనే లేదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com