సౌదీ అరేబియా లో ఘనంగా ఉగాది వేడుకలు...
- April 12, 2022
రియాద్: రియాద్ లో శుక్రవారం సాయంత్రం శ్రీ శుభకృత్ నామ ఉగాది సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఆనందభరితంగా జరిగాయి. APNRTS మరియు తెలుగు కళా క్షేత్రం ఆధ్వర్యంలో APNRTS కో-ఆర్డినేటర్ రెవెల్ అంథోని అబెల్ నాయకత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని భారత సీనియర్ దౌత్యవేత్త రాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
స్థానిక వైదేహి నృత్య విద్యాలయానికి చెందిన రేష్మీ వినోద్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నిలంబరి పాటపై సమంత్, హితార్ధ్, కుందన్, శౌర్య, తాహా, నందన్, పృథ్వీ, వినేష్, ఆర్షిత్, రియాన్, హిమంగ, సామ్నవి, భవిష్యలు చేసిన గ్రూప్ డాన్స్‌పై కూడా సభికులు చప్పట్ల వర్షం కురిపించారు.హైదరాబాద్‌కు చెందిన చేతన ప్రేం తన మధుర స్వరానికి తోడుగా సన్నివేశాల సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యాలతో నిజమైన వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందారు.ఆంధ్ర పంచె-ధోతితో తరుణ్ కృష్ణా కూడ ఆకర్షనీయంగా నిలిచారు.ఈ కార్యక్రమానికి సుమన్, బైరి సత్యనారాయణ, నవీన్, సుబ్బు, రంజీ, గాలి రవి, స్వామి, రావూరి, గోపి చందర్‌లు ఏర్పాట్లను పరిశీలించారు.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, భారతీయ ఎంబసీ అధికారులకు అంథోని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







