సరిహద్దును సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ..అరుదైన రికార్డును నమోదు
- April 14, 2022
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అరుదైన గుర్తింపును సంపాదించారు. భారత్, పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ తనపేరిట ఓ అరుదైన రికార్డును లిఖించుకున్నారు.
గురువారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ వాఘా బోర్డర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ భారత సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్) గౌరవ వందనాన్ని జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరించారు. తెలుగు నేలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. చివరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అత్యున్నత పదవిని అలంకరించారు. సీజేఐగా పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. తాజాగా వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి సీజేఐగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!