డాక్టర్ వ్యాలెట్‌ని దొంగిలించిన కేసులో ఇద్దరు అన్నదమ్ములకు జైలు

- April 14, 2022 , by Maagulf
డాక్టర్ వ్యాలెట్‌ని దొంగిలించిన కేసులో ఇద్దరు అన్నదమ్ములకు జైలు

మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు అన్నదమ్ములకు దొంగతనం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఓ డాక్టర్ వ్యాలెట్‌ని నిందితులు దొంగిలించారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళిన నలభయ్యేళ్ళ నిందితుడు, తనతోపాటు తన 35 ఏళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్ళాడు. వైద్య పరీక్షల నిమిత్తం లేబరేటరీలోకి వెళ్ళగా, ఓ హ్యాండ్ బ్యాగ్ అందులో వ్యాలెట్ కనుగొన్నారు నిందితులు. బ్యాగ్ తెరచి, అందులోని వ్యాలెట్ తీసుకుని పారిపోయారు. తన బ్యాగులో 25 బహ్రెయినీ దినార్ల నగదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఐీ కార్డు పలు ఏటీఎం కార్డులు వున్నాయని బ్యాగు పోగొట్టుకున్న డాక్టర్ పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్ డ్రా కోసం కూడా నిందితులు ప్రయత్నించారుగానీ, పిన్‌ నంబర్ తెలియకపోవడంతో అది సాధ్యపడలేదని పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com