ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు స్టూడెంట్స్ మృతి

- April 15, 2022 , by Maagulf
ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు స్టూడెంట్స్ మృతి

మస్కట్: అల్ బతినా హైవేపై బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పోలీసును, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో 7 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. మిఖలేవ్ వంతెన తర్వాత బటినా హైవే లేన్ నుండి బస్సు అదుపుతప్పిందని, తొలుత ఒక పోలీసు అధికారిని ఢీకొట్టి ఆపై సర్వీస్ రోడ్‌లో ట్రాక్‌లో ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com