ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్ సక్సెస్
- April 15, 2022
హైదరాబాద్: ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OLECTRA) తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్‌ను శుక్రవారం నాడు విజయవంతంగా ప్రారంభించింది.ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి, మార్కెట్ లీడర్‌గా ఉన్న ఒలెక్ట్రా ట్రక్కుల తయారీకి శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా రూపొందించిందే ఈ అంతర్నిర్మిత హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్.ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది,సింగిల్ ఛార్జితో 220 కి.మీ. ప్రయాణం చేయవచ్చు.ఈ టిప్పర్ 25 శాతం డ్యూటీ బోగీ సస్పెన్షన్ గ్రేడబిలిటీ (ఎత్తైన రోడ్లూ, ఘాట్ రోడ్లు) కూడా కలిగి ఉంటుంది.త్వరలో హైదరాబాద్ శివార్లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా ఉన్న,ఒలెక్ట్రా ఇప్పుడు హెవీ డ్యూటీ టిప్పర్ ట్రయల్స్‌ను ప్రారంభించింది.భారతదేశంలో ఈ రకమైన ట్రక్ ఇదే మొదటిది కావడం గర్వకారణం.పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటం తో,ఎలక్ట్రిక్ ట్రక్కులు ఈ రంగంలో గేమ్-ఛేంజర్‌గా మారతాయి.ఈ టిప్పర్ పనితీరు అద్భుతంగా, సమర్థవంతంగా ఉంటుంది.ఒలెక్ట్రా దీన్ని సాధ్యం చేసింది.ఇంతకు ముందు వాగ్దానం చేసినట్లు, మేము కలను సాకారం చేస్తున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!







