తెలంగాణ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆహ్వానం

- April 16, 2022 , by Maagulf
తెలంగాణ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆహ్వానం

హైదరాబాద్: ప్రజారవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకువెళ్లే  సృజనాత్మకత మీలో ఉందా!

తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనుకుంటున్నారా!? 
అయితే..  అలాంటి వాళ్ల కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను ఆర్టీసీ నిర్వహిస్తోంది. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర  కన్నా తక్కువగా రూ.100కే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్, కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలను తీసి మాకు పంపించండి. ఆర్టీసీ మీకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తుంది. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో మొదటి బహుమతి   రూ.10 వేలు, రెండో బహుమతి రూ.5వేలు, మూడో బహుమతి రూ.2500 అందజేయబడుతుంది. మరియు 10 కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. 
ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొనాలనుకుంటే మీ పూర్తి  వివరాలను ఈ నెల(ఏప్రిల్) 21 లోగా [email protected] పంపించండి.   గమనిక: ఈ కింద పేర్కొన్న ఏదో ఒక అంశంపైనే షార్ట్ ఫిలింలు తీయాల్సి ఉంటుంది., వ్యవధి : 120 Seconds/2 Mins 
1. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం
2. లీటర్ పెట్రోల్ ధర  కన్నా తక్కువకే రూ.100కి రోజంతా హైదరాబాద్ సిటీ  బస్సుల్లో ప్రయాణం
3. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్, 
4. ఆర్టీసీ కార్గో సేవలు
5. గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com