వాట్సాప్ ద్వారా టీకా సర్టిఫికేట్ అప్‌డేట్
- April 18, 2022
కువైట్: తమ పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించుకున్న పౌరులు, నివాసితులు టీకా సర్టిఫికేట్‌లపై తమ డేటాను అప్‌డేట్ చేయడానికి వాట్సాప్ నంబర్ 24971010ను సంప్రదించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. పౌరులు, నివాసితులు టీకాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొత్త పాస్‌పోర్ట్ కాపీని, ఇమ్యూన్ అప్లికేషన్ నుండి టీకా ధృవీకరణ పత్రాల కాపీలను వాట్సాప్ నంబర్‌కు పంపడం ద్వారా టీకా ధృవీకరణ పత్రంపై పాస్‌పోర్ట్ నంబర్‌ను అప్ డేట్ చేసుకునేందుకు రిక్వెస్ట్ పంపవచ్చు. మిష్రెఫ్‌లోని సెంటర్ టీకా సర్టిఫికేట్ డేటాను తక్కువ వ్యవధిలోనే కొత్త పాస్‌పోర్ట్ నంబర్‌తో అప్ డేట్ చేస్తుంది. టీకా సర్టిఫికేట్‌లో పాస్‌పోర్ట్ నంబర్ తప్పనిసరిగా పాస్‌పోర్ట్ తో సరిపోలాలని, కొన్ని దేశాలలో ప్రవేశించడానికి ఇది అవసరమని అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







