అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త
- April 19, 2022
అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో సోమవారం నుంచి భారీ విద్యార్థి వీసా స్లాట్లను అమెరికా కాన్సులేట్ కార్యాలయం విడుదల చేసింది. స్లాట్ల కోసం వేచి ఉండే సమయాన్ని 911 రోజుల నుంచి 68 రోజులకు తగ్గించింది. అయితే పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం వెయిట్ చేయాల్సిందే. హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయంలో పర్యాటక వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారం కూడా 899 రోజులుగానే ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







