యూఏఈ: 5ఏళ్ల కాలపరిమితితో మరో కొత్త రెసిడెన్సీ పథకం..

- April 19, 2022 , by Maagulf
యూఏఈ: 5ఏళ్ల కాలపరిమితితో మరో కొత్త రెసిడెన్సీ పథకం..

యూఏఈ: ప్రవాసుల కోసం మరో కొత్త రెసిడెన్సీ పథకాన్ని ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం.ఐదేళ్ల కాలపరిమితితో దీన్ని తీసుకువస్తోంది.ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను ఆకర్షించడానికి ఈ కొత్త రెసిడెన్సీ స్కీమ్‌ను ప్రకటించింది. నివాస అనుమతి రద్దు చేయబడిన తర్వాత లేదా రెసిడెన్సీ గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో గరిష్టంగా ఆరు నెలల వరకు ఉండడానికి అనువైన గ్రేస్ పీరియడ్‌ను అందించడం ఈ పథకం ప్రత్యేకత. 

నైపుణ్యం కలిగిన ఉద్యోగులు

నైపుణ్యం గల ఉద్యోగులు..నైపుణ్యం గల ఉద్యోగులకు ఎలాంటి స్పాన్సర్, ఎంప్లాయర్ అవసరం లేకుండా ఐదేళ్ల నివాస అనుమతి కల్పిస్తోంది. అయితే, దరఖాస్తుదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌ను కలిగి ఉండాలి.అలాగే మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మొదటి లేదా రెండవ లేదా మూడో వృత్తిపరమైన స్థాయిని కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు కనీస విద్యా స్థాయి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ లేదా దానితో సమానమైన ఇతర డిగ్రీ పూర్తయి ఉండాలి.నెలవారీ జీతం 15,000 దిర్హాములు కంటే తక్కువ ఉండకూడదు.

పెట్టుబడిదారులు లేదా భాగస్వాములు

పెట్టుబడిదారులు లేదా భాగస్వాములుదేశంలో పెట్టుబడిని ప్రోత్సహించేందుకు పెట్టుబడిదారులు లేదా భాగస్వాములకు ఈ నివాస పథకాన్ని యూఏఈ అమలు చేస్తోంది. ఇది వాణిజ్య కార్యకలాపాలను స్థాపించే లేదా పాల్గొనే పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల రెసిడెన్సీని అందిస్తుంది.ఇంతకు ముందు పెట్టుబడిదారుల కోసం రెండేళ్ల కాలపరిమితితో ఒక స్కీమ్ ఉండేది.ఇప్పుడు దాన్ని ఇది భర్తీ చేస్తుంది. 

ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి వ్యక్తులు

నైపుణ్యం గల ఉద్యోగులు..నైపుణ్యం గల ఉద్యోగులకు ఎలాంటి స్పాన్సర్, ఎంప్లాయర్ అవసరం లేకుండా ఐదేళ్ల నివాస అనుమతి కల్పిస్తోంది. అయితే, దరఖాస్తుదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌ను కలిగి ఉండాలి. అలాగే మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మొదటి లేదా రెండవ లేదా మూడో వృత్తిపరమైన స్థాయిని కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు కనీస విద్యా స్థాయి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ లేదా దానితో సమానమైన ఇతర డిగ్రీ పూర్తయి ఉండాలి. నెలవారీ జీతం 15వేల దిర్హాములు కంటే తక్కువ ఉండకూడదు.5ఏళ్ల కాలపరిమితితో UAE మరో కొత్త రెసిడెన్సీ పథకం.. ఎవరికి ఇస్తారంటే.. ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి వ్యక్తులు..ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో రెసిడెన్సీ సౌకర్యం కల్పిస్తోంది.దీనికి మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ నుండి ఫ్రీలాన్స్/స్వయం ఉపాధి అనుమతిని పొందడం అవసరం.కనీస విద్యా స్థాయి బ్యాచిలర్ డిగ్రీ లేదా ప్రత్యేక డిప్లొమా అయి ఉండాలి.గత రెండు సంవత్సరాల్లో స్వయం ఉపాధి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం 360,000 దిర్హాములు కంటే తక్కువ ఉండకూడదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com