మస్కట్ లో ఘనంగా ఉగాది వేడుకలు
- April 19, 2022
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్-తెలుగు కళా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు మస్కట్ లోని ఒమన్ హాల్, బ్యాంకింగ్ & ఫైనాన్సియల్ కాలేజ్, బోషర్ నందు ఏప్రిల్ 15న శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి.శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని కోరుకుంటూ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహంచారు.ఈ వేడుకల్లో షుమారు 600 మందికి పైగా ప్రవాసి తెలుగు వారు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ఇర్షిద్ అహ్మద్ ,కౌన్సిల్ (కార్మిక & సామాజిక సంక్షేమం), ఇండియన్ ఎంబసీ, ఒమన్ మరియు డా.లక్ష్మీ ప్రసాద్ కలపటపు,ఛైర్మన్ శుభోదయం గ్రూప్ ముఖ్యఅతిధిలు గా విచ్చేసారు.తొలుత జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు.
ఇర్షిద్ అహ్మద్ మాట్లాడుతూ...మస్కట్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం తెలుగు కళా సమితి వారు చేస్తున్న సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఈ సంధర్భంగా శుభోదయం గ్రూప్ ఛైర్మన్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... దేశం కాని దేశానికీ వచ్చి మన తెలుగు సాంప్రదాయాలను ఎంతో చక్కగా పాటిస్తున్నారు.అలాగే తెలుగు కళా సమితి వారు కోవిడ్ టైమ్ లో నిర్వహంచిన కొన్ని కార్యక్రమాలను YouTube లో చూశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాయని గాయకులు శ్రీనిధి తిరుమల మరియు వెంకట దుర్గా హనుమాన్ చావటపల్లి లతో పాడిన పాటలు అందరినీ అలరించాయి.
సంప్రదాయమైన జాన పద నృత్యాలతోపాటు, సినిమా పాటలు వీక్షకులను అలరించాయి.
ఉగాది పురస్కారాలు గత సంవత్సరం విద్యా రంగాలలో మంచి ఫలితాలు సాధించిన చిన్నారులకు డా.భాస్కర రావు జ్ఞాపకార్ధం పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు.. కన్వీనర్ ANIL, కో-కన్వీనర్ చిన్న, కోశాధికారి కమార్, శ్రీదేవి,సూరపునేని చైతన్య, ఇతర కార్యవర్గ సభ్యులు రాణి,రాజశేఖర్,ఆనంద్,చరణ్,శ్రీధర్,మూర్తి,పవన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శుభోదయం ముఖ్య స్పాన్సర్స్,ఈవంట్ పార్టనర్-ORBIT,మాగల్ఫ్.కామ్ మరియు టివి5 న్యూస్ మీడియా పార్టనర్ గా వ్యవహరించాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
_1650356740.jpg)

_1650356752.jpg)




తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







