ఇటికాఫ్ పర్మిట్ల కోసం ఇమ్యునైజేషన్ తప్పనిసరి: సౌదీ
- April 20, 2022
సౌదీ: ఇటికాఫ్ పర్మిట్లను జారీ చేసేందుకు సదరు దరఖాస్తు దారుల ఇమ్యునైజేషన్ తప్పనిసరి అని సౌదీ స్పష్టం చేసింది. ఇటికాఫ్ పర్మిట్ల కోసం వ్యక్తుల దరఖాస్తులను అంగీకరించడానికి వారు పూర్తి ఇమ్యునైజేషన్ కలిగి ఉండటం తప్పనిసరి అని రెండు పవిత్ర మసీదులలోని మార్గదర్శక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బాదర్ అల్-ఫ్రైహ్ తెలిపారు. గుర్తింపు కార్డ్, COVID-19కి వ్యతిరేకంగా టీకా డోసులను పూర్తి చేసినట్టు తెలిపే ధృవపత్రాలు ఇటికాఫ్ పర్మిట్ కోసం సమర్పించే దరఖాస్తుతో పాటు అందించాలి. ఇటికాఫ్ అనుమతులు చెల్లుబాటు తేదీ రమదాన్ చివరి పది రోజులు ముగిసే వరకు అమల్లో ఉంటాయి. రమదాన్ 21వ తేదీ నుండి ఈద్ అల్-ఫితర్ రాత్రి వరకు ఇటికాఫ్ పర్మిట్లు చెల్లుబాటు అవుతాయి అని బాదర్ అల్-ఫ్రైహ్ తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







