కేరళ నుండి కువైట్ దేశీ వాహనంలో కువైట్ చేరిన యువకుడు
- April 20, 2022
కువైట్: వేల కిలోమీటర్లు, దాదాపు 50 దేశాలు,నాలుగు నెలల పాటు మేడ్ ఇన్ ఇండియా మహీంద్రా థార్ SUV వాహనాన్ని నడుపుతూ కువైట్‌కు చేరుకున్న హఫీజ్.భారతదేశంలో తయారు చేసిన మహీంద్రా థార్‌లో నాలుగు దేశాలు,వేల కిలోమీటర్లు దాటి,19 ఏళ్ల హఫీజ్ కేరళ నుండి ఆఫ్రికా రహదారి యాత్రలో భాగంగా కువైట్ చేరుకున్నాడు.
ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన మహమ్మద్ హఫీస్ నవంబర్ 27న భారతదేశంలోని కేరళలోని మువట్టుపుజా నుండి KL 17 W 2866 బ్లాక్ కలర్ మహీంద్రా థార్ SUVలో తన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాడు.మొదట ఓడ ద్వారా తన కారును దుబాయ్‌కి తరలించాడు.డిసెంబర్ మొదటి వారంలో కారు దుబాయ్ చేరుకుంది.మేడ్ ఇన్ ఇండియా వాహనాన్ని రోడ్డు పై నడిపి యూఏఈ, సౌదీ, బహ్రెయిన్ దాటుకుని కువైట్ చేరుకున్నాడు హఫీజ్.ఇతను అన్ని GCC దేశాలను పూర్తి చేసి,దాదాపు 50 దేశాలను కవర్ చేయడానికి 2023 నాటికి ఆఫ్రికాకు చేరుకోవాలని యోచిస్తున్నాడు.అతని మార్గంలో ఖతార్,ఇరాక్,ఇరాన్ మరియు ఈజిప్ట్ ఉన్నాయి.దురదృష్టవశాత్తు, రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ని చూసి వారు అతని వాహన అనుమతిని తిరస్కరించినందున అతను ఒమన్ వీసా పొందలేకపోయాడు.
"మేము భారతదేశంలో ఎల్లప్పుడూ కుడివైపు వాహనాలను నడుపుతాము, కాబట్టి డ్రైవింగ్ ఇక్కడ సమస్య కాదు," అని తెలిపారు. "భారతీయ నిర్మిత వాహనాలను ప్రపంచానికి ప్రదర్శించడమే నా ఉద్దేశం. సాధారణంగా విదేశాల్లో ఆఫ్‌రోడింగ్‌కు భారతీయ వాహనాలనే ఎంచుకోరు.భారతీయ వాహనం కూడా దీనికి సమాన సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను నిరూపించాలనుకుంటున్నాను" అని హఫీస్ చెప్పాడు.ఎవరైనా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాబట్టి,ప్రక్రియ చాలా గజిబిజిగా ఉంటుంది.విధివిధానాలపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదని, ఇది చాలా సమయాన్ని కలిగిస్తోందని హఫీజ్ అన్నాడు.
ప్రయాణంలో హఫీస్ రాత్రి పూట తన కారులోనే నిద్రించేవాడినని చెప్పాడు.మంచి నిద్ర మరియు విశ్రాంతి స్థలం కోసం వెనుక సీటుకు కొన్ని సర్దుబాట్లు చేసుకున్నానని తెలిపాడు.కొన్ని దేశాల్లో, ప్రజలు నా పర్యటన పై ఆసక్తి చూపి తనకి వసతి ఏర్పాటు చేసారని తెలిపాడు."తన వాహనంతో ఎప్పుడూ ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదు మరియు ఇది పూర్తిగా నమ్మదగినది" అని హఫీస్ చెప్పాడు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







