నాలుగు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులపై దర్యాప్తు ప్రారంభం
- April 21, 2022
మనామా: మత్తుపదార్థాలు నింపిన 585 క్యాప్సూళ్లను తమ పేగుల్లోకి చొప్పించి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఆసియన్లపై యాంటీ డ్రగ్ డైరెక్టరేట్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నాలుగు నోటిఫికేషన్లు అందాయని ముహర్రాక్ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ ప్రకటించారు. అనుమానిత ఆసియన్లను బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. నోటిఫికేషన్‌లు అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక్కో సంఘటనపై విడివిడిగా విచారణ ప్రారంభించింది. ఇది సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో నిందితులను విచారించింది. విచారణ పెండింగ్ ఉన్న వారిని కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. ఘటనలపై ముమ్మరంగా విచారణ జరపాలని, స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలించేందుకు నిపుణులను నియమించాలని ఆదేశించింది. నేర పరిధిని గుర్తించడం, విదేశాల్లో ఉన్న అనుమానితులను చేరుకోవడం, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం విచారణలు కొనసాగుతున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







