రమదాన్ చివరి పదిరోజులకు భద్రతా సన్నాహాలు పూర్తి
- April 21, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో చివరి పది రోజులకు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ యంత్రాంగంతో సహా భద్రతా విధానాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుదిట్టం చేసింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్-జనరల్ షేక్ అహ్మద్ అల్-నవాఫ్ సూచనల మేరకు మినిస్ట్రీ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రమదాన్ చివరి పదిరోజులకు సంబంధించి భద్రతా, ట్రాఫిక్ చర్యలను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మస్జీదులు, మార్కెట్లు, వాణిజ్య సముదాయాల చుట్టూ భద్రతను అందించడం సమగ్ర భద్రతా ప్రణాళిక లక్ష్యం. దీంతోపాటు పదిరోజుల్లో ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాహనదారులు, రహదారి వినియోగదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి, మస్జీదులకు భక్తుల రాకను సులభతరం చేయడానికి, కియామ్ ప్రార్థనను సమర్థవంతంగా నిర్వహించడానికి సూచనలు, ట్రాఫిక్ చట్టాలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. మస్జీదులలో లేదా షాపింగ్ చేసేటప్పుడు తమ వాహనాల లోపల విలువైన వస్తువులను ఉంచవద్దని అధికారులు పౌరులకు, నివాసితులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







