టీడీపీ సంచలన ప్రకటన..సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా
- April 21, 2022
అమరావతి: తెలుగుదేశం పార్టీ గుడ్ న్యూస్ తెలిపింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు ఏపీలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భాంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసి ఆనందం నింపారు. ఈసారి ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే విధానాన్ని తెలుగుదేశం అందుబాటులోకి తెచ్చింది.వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్‌ల ద్వారా సభ్యత్వం పొందే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు. 9858175175 నెంబర్‌కు వాట్సాప్ నుంచి హాయ్ అని సందేశం పంపిస్తే.. నమోదు ప్రక్రియ మొదలవుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లోనూ సభ్యత్వ నమోదు, లేదా పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలుగుదేశం నాయకులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







