గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టివేత
- April 22, 2022
గుజరాత్: మరోసారి గుజరాత్లో డ్రగ్స్ కలకలం రేగింది. కచ్ జిల్లాలోని కాండ్లా రేవులో 260 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ రూ.1300 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో భారత్‌కు హెరాయిన్ తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు నిన్న సంయుక్తంగా దాడులు చేసి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలోనూ హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







