ప్రభాస్ సినిమాలో కొత్త వారికి ఛాన్స్
- April 22, 2022
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' ఇటీవల విడుదలైంది. అయితే, ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలో పని చేసే సువర్ణ అవకాశం కల్పిస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకెళ్లితే…'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ లో కొత్త వారికి అవకాశాలివ్వాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టంట్ క్రూ కాల్ పేరిట ప్రకటన ఇచ్చింది. టాలెంట్ ఉన్న వారిని తమ సినిమాలో తీసుకోవాలని దర్శకులు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్న వారు, పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే కనుక వారు తమ టీమ్ ను సంప్రదించాలని కోరుతూ వైజయంతి మూవీస్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్టు పెట్టారు. ఆసక్తి ఉన్న వారు అందులో పేర్కొన్న మెయిల్ కు తమ ప్రొఫైల్ పంపాలని సూచించారు. ప్రస్తుతం ఈ పిక్చర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







