ఢిల్లీలో మళ్లీ కరోనా ఆంక్షలు...
- April 22, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్‌లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ.. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2వేల 380 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మాస్క్ పెట్టకపోతే 500 రూపాయలు ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ కార్లలో ప్రయాణించే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. స్కూళ్లలో కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులు, సిబ్బందికి థర్మల్ స్కానింగ్ తప్పనిసరి చేశారు. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ వస్తువులను పంచుకోకుండా విద్యార్థులపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఢిల్లీలో కరోనా కొత్త కేసులతో పాటు కొత్త వేరియంట్ కూడా కలకలం రేపుతోంది. కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు. ఢిల్లీతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో కేసులు భారీగా పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరింత పరిశోధనలు చేస్తున్నామన్నారు. కొత్త వేరియంట్లపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







