ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ రిక్రూట్‌మెంట్ లక్ష్యంగా TCS
- April 23, 2022
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు ఏకంగా 1.85 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకున్నాయి. ఒకవైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస్థలు..మరోవైపు ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఉద్యోగుల వలసలతో ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదిగా ఐటీ సంస్థల్లో వలసలు భారీగా పెరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం టీసీఎస్‌లో 8.6 శాతంగా ఉన్న వలసల శాతం గతేడాదికిగాను 17.4 శాతానికి చేరుకున్నది. అటు ఇన్ఫోసిస్‌లోనూ వలసలు భారీగా పెరిగాయి. 2020-21లో 13.9 శాతంగా ఉండగా.. 2021-22లో ఇది 27.7 శాతానికి చేరుకున్నది.
డిచిన మూడు త్రైమాసికాలుగా వలసలు అధికంగా ఉండటంతో ప్రతిభ తక్కువ ఉన్న విద్యార్థుల కోసం ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. 2020-21లో క్యాంపస్‌ల రిక్రూట్‌మెంట్ల ద్వారా టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 21 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ టెక్ దిగ్గజం 2021లో IT డొమైన్‌లో 40,165 మందిని నియమించుకొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర ప్రాతిపదికన 35,209 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేర్కొంది. ఇది ఒక త్రైమాసికంలో చేపట్టిన నియామకాల కంటే చాలా ఎక్కువని వివరించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ..‘ మేము 2022 కోసం ప్రస్తుత లక్ష్యానికి అనుగుణంగా కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాము. TCS లో ఉద్యోగుల సంఖ్య 5,92,125 గా ఉంది.’ అని చెప్పారు.
ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2020, 2021లో సంవత్సరాలలో MSc, MA పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ల కోసం, 2022లో చదువుతున్న వారి కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. TCS అట్లాస్ హైరింగ్ కేటగిరీ కింద ఈ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఒక పరీక్ష, ఇంటర్వ్యూను క్లియర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కుhttp://tcs.comలో అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







