అల్ ఖుద్రా లేక్ కు రెండు వరుసల రహదారి

- April 25, 2022 , by Maagulf
అల్ ఖుద్రా లేక్ కు రెండు వరుసల రహదారి

దుబాయ్:  ప్రముఖ ఎడారి టూరిస్టు ప్రాంతం అల్ ఖుద్రా సరస్సులకు వెళ్లేందుకు విస్తరించిన కొత్త రహదారి వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.సైహ్ అల్-దహల్ రోడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ కింద విస్తరించిన ఈ రహదారి అల్ ఖుద్రా లేక్ లను అనుసంధానిస్తుంది.ఈ సరస్సుల ప్రాంతం గుండె ఆకారంలో ఉండే లవ్ లేక్, స్వాన్ లేక్, ఫ్లెమింగో లేక్‌లతో సహా మానవ నిర్మిత సుందర ప్రదేశాల సమూహం.ఇప్పటివరకు ఈ ప్రాంతానికి సేవలందించిన 11 కిలోమీటర్ల సింగిల్-లేన్ రహదారిని విస్తరించడంతో ట్రాఫిక్ సామర్థ్యం రెట్టింపు కానుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com