దుబాయ్‌లో చెత్త డంపింగ్‌పై డ్రోన్ అస్త్రం
- April 05, 2016
దుబాయ్ మునిసిపాలిటీ అక్రమ చెత్త డంపింగ్‌పై డ్రోన్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీచ్‌లు, ఎడారి ప్రాంతంలో అక్రమంగా చెత్తని డంప్ చేసేవారిపై కొరడా ఝుళిపించడానికి ఈ డ్రోన్లు ఉపయోగపడనున్నాయి. తొలి విడతగా ఓ డ్రోన్‌ని రంగంలోకి దించుతున్నారు. అక్రమంగా చెత్త డంప్ చేస్తున్నవారిని గుర్తించడానికి ఇప్పటివరకూ ఇన్స్పెక్టర్లను దుబాయ్ మునిసిపాలిటీ ఉపయోగిస్తూ వస్తోంది. అయితే వారి రాకను పసిగట్టి అక్రమార్కులు తప్పించుకునేవారు. డ్రోన్ల వాడకంతో అక్రమ డంపింగ్ చేసేవారు తప్పించుకోడానికి వీలు లేదు. డ్రోన్ల ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో దుబాయ్ మునిసిపాలిటీ అక్రమ డంపింగ్‌పై నిఘా పెడుతుంది. డ్రోన్ తీసే ఫొటోలు, వీడియోల ఆధారంగా నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోడానికి వీలవుతుంది. అయితే డ్రోన్లను సామాన్యులు వాడకంపై ఏప్రిల్ 2015 నుంచి కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నాయి. భూమి నుంచి 400 అడుగుల ఎత్తులో మాత్రమే డ్రోన్లను ఎగురవేయాలి. పగటి పూట, అది కూడా మంచి వాతావరణ పరిస్థితుల్లోనే డ్రోన్లను వినియోగించాలి. ఎయిర్‌పోర్టుల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వాడరాదు. భవనాలు, ఇళ్ళు, ప్రైవేట్ ప్రాపర్టీస్ సమీపంలో డ్రోన్లను ఉపయోగించరాదు. సరదా కోసం తప్ప, కమర్షియల్ వినియోగం కోసం డ్రోన్ల వాడకం నిషేధం.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







