సౌదీలో దేశీయ విమాన ఛార్జీల్లో మార్పులు!
- April 27, 2022
రియాద్: దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలలో మార్పులను ఎదుర్కోవటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇటీవల కొన్ని కేటగిరీలో విమాన టిక్కెట్ల ధరల్లో మార్పును గమనించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దేశీయ విమాన టిక్కెట్ల ధరలలో మార్పుల గురించి ప్రచారం అవుతున్న వార్తలను గమనిస్తున్నట్లు తెలిపింది. రాజ్యంలో పౌర విమానయాన రంగాన్ని రెగ్యులేటర్ హోదాలో పరిశీలన చేస్తున్నామని, విమాన కంపెనీల ధరల ప్యాకేజీలను గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే విమాన రవాణా ధరలను సమీక్షించడంతో పాటు సీట్ల సామర్థ్యంలో పెరుగుదల, విమానాల సంఖ్యపై కూడా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు తగిన ధరలను నిర్ణయించడం, వాయు రవాణా రంగంలో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు GACA పేర్కొంది. ప్రయాణీకుల హక్కులు, వారి రక్షణకు తమ మొదటి ప్రాధాన్యత కొనసాగుతుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







