వైజాగ్ లో స్టూడియో నిర్మించే యోచనలో బాలయ్య, చెర్రీ !

- April 05, 2016 , by Maagulf
వైజాగ్ లో స్టూడియో నిర్మించే యోచనలో బాలయ్య, చెర్రీ !

తెలుగు సినీపరిశ్రమ చెన్నై నుంచి తరలి వచ్చాక హైదరాబాద్ లో అన్ని హంగులూ సమకూర్చుకొని ఇక్కడ స్థిరపడేందుకు దాదాపు 40 ఏళ్లు పట్టింది. విశాఖపట్నంలో స్థిరపడాలన్నా కొన్నేళ్లు పడుతుంది. హైదరాబాద్ లో సారథీ స్టూడియో, అన్నపూర్ణా, రామానాయుడు, పద్మాలయా, రామోజీ ఫిలింసిటీ వంటి అన్ని సదుపాయాలూ ఉన్న అద్భుతమైన సినీ స్టూడియోలు ఉన్నాయి.విశాఖపట్నాన్ని కూడా సినిమా రాజధానిగా తీర్చి దిద్దాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. విశాఖను సినిమా నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయాలని అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. ఆయన కల ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోలు బాలకృష్ణ, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్ విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ముగ్గురు నటులు విశాఖలో స్టూడియోలు నిర్మించే ఆలోచనలో ఉన్నారని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. ఇదంతా ఆచరణలోకి వస్తే ...విశాఖను మూవీ లాండ్ చేయాలన్న చంద్రబాబు నాయుడు కల ఫలించినట్టే మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com