బలూచ్ ఆర్మీ దెబ్బ.. గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా

- April 27, 2022 , by Maagulf
బలూచ్ ఆర్మీ దెబ్బ.. గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా

 చైనా: మన శత్రువు దేశం పాకిస్థాన్‌కు దాని మిత్ర దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోగా అందులో ముగ్గురు చైనా పౌరులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో దాడిని ఖండిస్తూ చైనా దేశపు అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌లో ఉన్న చైనీయుల రక్షణ కోసం మరింత కృషి చేయాలని కోరింది. చైనీయుల వ్యాపారాలు, కార్యాలయాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని కట్టడి చేయాలని సూచించింది. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.

ఇదిలా ఉండగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్వాదర్ పోర్టును విడిచి పెట్టి, బలూచిస్తాన్‌లో చైనా తమ కార్యకలాపాలను నిలిపివేయకుంటే మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది. కాగా, ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ ఉన్నత విద్యావంతురాలు. 30 ఏళ్ళ వయసున్న ఈమెకు ఇద్దరు పిల్లలు, భర్త వైద్యుడు. ఆమె ఇష్టప్రకారమే ఆత్మాహుతి దాడికి సిద్ధపడిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com