తిరుపతి రుయా ఆసుపత్రి అంబులెన్స్ ల దందాపై స్పందించిన ఏపీ సీఎం జగన్
- April 27, 2022
అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగతంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. మంగళవారమే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సీఎంను కలిసి ఘటన గురించి వివరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయని జగన్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







