బల్గేరియా, పోలండ్ దేశాలకు గ్యాస్ సరఫరా ఆపేసిన రష్యా

- April 27, 2022 , by Maagulf
బల్గేరియా, పోలండ్ దేశాలకు గ్యాస్ సరఫరా ఆపేసిన రష్యా

మాస్కో: బల్గేరియా, పోలండ్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు రష్యా ఇంధన సరఫరా దిగ్గజం గజ్‌ప్రామ్ తెలిపింది. గ్యాస్ లావాదేవీలను రష్యా కరెన్సీ రూబుల్‌లో చేయడానికి ఆ దేశాలు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోయినా తమకు ఇబ్బంది లేదని పోలండ్ పేర్కొంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ముందుగానే చెల్లింపులు జరిపినా.. గ్యాస్ సప్లై నిలిపివేయడాన్ని బల్గేరియా తప్పుబట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com