కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు..

- April 28, 2022 , by Maagulf
కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు..

కువైట్ సిటీ: కువైట్ కేబినేట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. అయితే, మాస్క్‌ వేసుకోవడం అనేది అప్షనల్‌గా పేర్కొంది. ఏవైనా లక్షణాలు ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని తెలిపింది. అలాగే ఇమ్యునైజేషన్ స్టేటస్‌, పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా అన్ని బహిరంగ ప్రదేశాల్లోకి వ్యక్తులను అనుమతించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకోని వారిని పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా ఇన్సిట్యూషన్, కార్యాలయాల్లో అనుమతించాలని ఆదేశించింది.ఇక ఎవరైనా వైరస్ బారిన పడితే ఐదు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని, అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరో ఐదు రోజుల పాటు మాస్క్ ధరించాలని తెలిపింది. అటు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ 2022 మే 1(ఆదివారం) నుండి వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా విదేశాల నుండి వచ్చే వారందరికీ పీసీఆర్ పరీక్షను రద్దు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com