భారత్‌లో భానుడి భగభగ..
- April 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో ప్రచండ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. మాడు పగులుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ,ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇక నిజామాబాద్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలులో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.దేశ రాజధాని ఢిల్లీలోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతోంది.వడగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని ఐఎండీ అంచనా హెచ్చరిస్తోంది.
ఒక్కరోజే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరగవచ్చని చెబుతోంది.ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలను హెచ్చరించారు.దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిపై బుధవారం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో… దేశంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, మామూలుగా కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.
అడవులు, ముఖ్యమైన భవనాలు, ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతుండటం ఇటీవల మనం చూస్తున్నామని.. ఫైర్ సేఫ్టీని పాటించాలని సూచించారు. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో తూర్పు, మధ్య, వాయవ్య భారత దేశంలో వడగాడ్పుల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాలలు, వృద్ధులు, తీవ్ర స్థాయిలో వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







