'ఇద్దరిమధ్య-18' సినిమా ప్రారంభం

- April 05, 2016 , by Maagulf
'ఇద్దరిమధ్య-18' సినిమా ప్రారంభం

దృశ్యకావ్యం ఫేం కార్తీక్‌, భాను జంటగా రూపొందుతున్న నూతన చిత్రం 'ఇద్దరిమధ్య-18'. మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్ర పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హాజరయ్యారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకుడిగా నాని ఆచార్య పనిచేస్తున్నారు. శివరాజ్‌పాటిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం సమకూరుస్తున్నారు. ముక్కోటి, 'జబర్దస్త్‌' టీం రచ్చరవి, రాఘవ, అప్పారావ్‌, గీతాసింగ్‌, చిట్టిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com